తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ఓపెన్
తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలను ఓపెన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పున: ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబరు 8 నుంచి విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. కానీ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంతో వైద్యశాఖ సిఫారసు మేరకు ఈ నెల 31 వరకు సెలవులను పొడిగించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గడంతో పాటు, పొరుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలు తెరుచుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలోనూ విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.













