జనవరి 1 నుంచి నుమాయిష్
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏటా నిర్వహించే అఖిల భారతీయ పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నూమాయిష్) జనవరి 1న ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానాంలోని గాంధీ సెంటినరీ లైబ్రరీ ఆయన మాట్లాడారు. గతేడాది చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రూ.3 కోట్లతో రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అగ్నిమాపక వాహనాలు సహా అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థపూ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందించేలా శిక్షణ పొందిన 40 మందిని నియమించామని తెలిపారు.
ఏటా ఎగ్జిబిషన్‌ను సందర్శించడానికి 20 లక్షల మంది వస్తున్నారని, వారికి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని చెప్పాయి. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 18 విద్యా సంస్థలకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు.













