6న అలయ్ బలయ్ : బండారు విజయలక్ష్మి
హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ నెల 6న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగే ఆలయ్ బలయ్ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించామని, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, ఆంధ్రప్రదేశ్, కేరళ గవర్నర్లు బిశ్వభూషన్ హరిచందన్, మహ్మద్ అరిఫ్‌ఖాన్ కేంద్ర మంత్రులు కిసన్ రెడ్డి, భగవంత్ ఖుబా, సిని నటుడు చిరంజీవి, రాష్ట్ర మంత్రులు, అధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు.













