అలయ్ బలయ్ ను విజయవంతం చేయాలి
తెలుగు రాష్ట్రాల ప్రజలు అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బండారు విజయలక్ష్మీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతిని ప్రతిభిస్తోందని అన్నారు. ఈ నెల 17న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొంటారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా గవర్నర్లు కూడా అలయ్ బలయ్‌లో పాల్గొంటారన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించామన్నారు. కోవిడ్ సమయంలో సేవచేసిన వారిని అలయ్ బలయ్ వేదికపై ఘనంగా సత్కరిస్తామని తెలిపారు.













