నేడు హైదరాబాద్ కు అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నేడు హైదరాబాద్‌కు వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన భేటీ కానున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ లఖ్‌నవ్ వెళ్లి అఖిలేశ్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడానికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. బేగంపేట నుంచి అఖిలేశ్ నేరుగా సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఆయన కోసం ప్రత్యేకంగా మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు. అనంతరం కేసీఆర్‌తో అఖిలేశ్ సమావేశమై జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం తిరిగి అఖిలేశ్ లఖ్వన్ వెళ్లనున్నారు.













