ప్రత్యామ్నాయ మార్గం కోసం దేశ ప్రజలు
దేశంలో ప్రజలు నిరాశతో ఉన్నారని, ప్రత్యామ్నాయ మార్గంకోసం ఎదురు చూస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో జాతీయ రాజకీయాలు, దేశంలో రావాల్సిన గుణ్మాతక మార్పుపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు, దళితులు, పేదలు, ఎవరూ సంతోషంగాలేరని, వారిని సమస్యలనుంచి దూరంచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రగతిశీల ఆలోచనలు కలిగిన నాయకుల్ని ఏకంచేసి అందరూ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఇది రాజకీయ క్రీడో లేకపోతే ఎన్నికల కోసం చేస్తున్న ప్రయత్నాలో కావాని సృష్టం చేశారు. అందరీ అవకాశం ఉంటుందని, ఎవరూ అంటారానివారు కాదన్నారు.













