సీఎం కేసీఆర్ తో అఖిలేశ్ యాదవ్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడానికి అఖిలేశ్ హైదరాబాద్‌కు వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అఖిలేశ్, అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, తలసాని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్, అఖిలేశ్‌కు విందు ఇచ్చారు. ఈ విందులో మంత్రులు కేటీఆర్, తలసాని, ఇతర నేతలు పాల్గొన్నారు. విందు అనంతరం తాజా రాజకీయాలపై కేసీఆర్, అఖిలేశ్ చర్చిస్తున్నారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ వివిధ పార్టీల నేతలో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుపై అఖిలేశ్‌తో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
అఖిలేష్ కు సీఎం కేసీఆర్ విందు
ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విందు ఇచ్చారు. ప్రగతి భవన్లో కేసీఆర్ అఖిలేష్ గౌరవార్ధం ఇచ్చిన విందుకు మంత్రులు ఎమ్మెల్మేలు హాజరయ్యారు. అనంతరం జరిగే భేటీలో కేసీఆర్, అఖిలేష్ ఫెడరల్ ఫ్రంట్, దేశంలో రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.













