మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే.. కొత్త ప్రభుత్వానికి
మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. అసెంబ్లీలో గవర్నర్ ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మద్దతు ఇచ్చాం. రాజకీయాలు ఎన్నికల వరకే. గెలిచిన పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పని చేయాలి. పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలని కోరుతున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావనే లేదు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.













