మనది మిగులు రాష్ట్రమా, లోటు రాష్ట్రమా?
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రవేశపెడుతున్న బడ్జెట్ అంచనాలకు వాస్తవ లెక్కలకు పొంతన కుదరటం లేదని మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అంచనాలను అందుకోలేకపోతున్నప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమెలా అవుతుందని ప్రశ్నించారు. మనది మిగులూ రాష్ట్రమా, లోటు రాష్ట్రమా అన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. 2014-15 నుంచి బడ్జెట్ అంకెలు ఉటంకిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యువతలో మత్తు పదార్థాల వినియోగం విపరీతంగా పెరిగిపోతోందని, దీని వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని తెలిపారు. దీన్ని నిరోధించే వ్యవస్థను పట్టిష్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాగ్ రిపోర్టును భలో ఎందుకు ప్రవేశపెట్టలేదో చెప్పాలని, ప్రతీసారి సమావేశాల చివరి రోజు కాకుండా, ముందుగానే సభలో కాగ్ రిపోర్టును ఉంచాలని డిమాండ్ చేశారు.













