కొత్త సీఎస్‌గా అజయ్విశ్రా?
ఈ నెలాఖరుతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషీ పదవీ విరమణ చేస్తున్నందున కొత్త సీఎస్ ఎంపికపై ప్రభుత్వం సూచనప్రాయ నిర్ణయం తీసుకుంది. ఈ పదవికీ అర్హత కలిగివున్న 14 మంది సీనియర్ ఐఏఎస్‌లు పోటీ పడుతున్నప్పటికీ అజయ్ విశ్రా పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కాలంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో సాధారణ పరిపాలన శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన అనుభవం దృష్ట్యా సరైన వ్యకి అని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రగతిభవన్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ నెల 28న జరుగనున్న రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సీఎస్ ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.













