తెలంగాణ నుంచి రాజ్యసభకు అజయ్ మకెన్ ?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే దక్కే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఏఐసీసీ కోటాలోకి వెళ్లనుంది. కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు అజయ్ మకెన్ను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. అయజ్ మకెన్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఏఐసీసీ సోషల్ మీడియా చైర్మన్ సుప్రియా శ్రీనేత్ కూడా ఏఐసీసీ కోటలో రాజ్యసభకు పోటీ పడుతున్నారు. చివరి క్షణంలో ఎలాంటి మార్పులు జరగకపోతే ఆయనకే టికెట్ ఇవ్వచ్చని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్ర కోటా అభ్యర్థిగా తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్లో పలువురు సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. అజయ్ మకెన్ జనరల్ కేటగిరీకి చెందిన వారు కాబట్టి రాష్ట్ర కోటాలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి టికెట్ ఇస్తే బాగుంటుందని పార్టీ కసరత్తులు చేస్తోంది.













