అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐఎంఐఎం 9 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. తాజాగా ఆరు నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల పేర్లను ఆయన వెల్లడిరచారు. ఈసారి ఎన్నికల్లో రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నుంచి కూడా ఎంఐఎం ప్రాతినిధ్యం వస్తుందని తెలిపారు. చంద్రాయణగుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ, నాంపల్లి-మాజిద్ హుస్సేన్, చార్మినార్-మాజీ మేయర్ జుల్ఫికర్, యాకుత్‌పురా-జాఫర్ హుస్సేన్ మిరాజ్, మలక్‌పేట – అహ్మద్ బలాల, కార్వాన్ నుంచి కౌసర్ మొయినుద్దీన్ బరిలోకి దిగుతారని తెలిపారు. బహదూర్‌పూరా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల అభ్యర్థుల్ని తర్వలోనే ప్రకటిస్తామని, ఒకట్రెండు రోజుల్లో ప్రచారం ప్రారంభిస్తామని ఒవైసీ తెలిపారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఎంఐఎం ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు.













