మా ముందు ఎవరైనా తలవంచాల్సిందే
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే ఎవరినైనా సీఎం పీఠంపై కూర్చోబెడుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ అయినా, కేసీఆర్ అయినా తమకు గొడుగుపట్టాల్సిందేన్నారు. మబ్లిస్ ముందు ఎవరైనా తలవంచాల్సిందనని ఆయన సృష్టం చేశారు. డిసెంబర్ 11 తర్వాత తమ సత్తా ఏమిటో చూపుతామని చెప్పారు. మరోవైపు అక్బర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదని రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం అనధికారికంగా కూటమిగా ఏర్పడ్డాయనే విమర్శలు వస్తున్నాయి. ఎంఐఎం పోటీ చేస్తున్న ఏడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఈ సీట్లను ఆ పార్టీ గంపగుత్తగా గెలుచుకునేందుకు టీఆర్ఎస్ సహకరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.













