తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 20వ తేదీన వరంగల్‌లో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు సభ జరగనుంది. ఈ మేరకు ఢిల్లీలోని రాహుల్ గాంధీ కార్యాలయం ఆయన పర్యటన వివరాలను ఖరారు చేసింది. ఈనెలలో తెలంగాణలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి ఆ సభకు రాహుల్‌ను రప్పించాలని టీ పీసీసీ గత నెలలోనే తలపెట్టింది. అంతేగాక ఇటీవల రేవంత్‌రెడ్డితోపాటు పలువురు టీడీపీ నేతలు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో టీ పీసీసీ కొత్త ఉత్సాహం కనబడుతుండగా రాహుల్ సభ ద్వారా కార్యకర్తల్లో కొత్త జోష్‌ను నింపాలని టీ పీసీసీ సంకల్పించింది.













