సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రికత్త.. పలురైళ్లకు నిప్పు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో వేల సంఖ్యలో ఆందోళనకారులు నిరసన తెలిపారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై ఆందోళనకారులు నిరసనలు కొనసాగించారు. స్టేషన్లో ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌కి నిప్పు పెట్టారు. ఆ రైలులో పార్సిల్ కౌంటర్ తెరిచే ఉంటడంతో మంటలు తర్వగా వ్యాపించాయి. క్షణాల్లో ఇతర బోగీలకు చేరుకున్నాయి. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ అంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఈస్కోస్టుతో పాటు అజంతా, ఒక ఎంఎంటీఎస్ రైలు బోగీలు మంటల్లో కాలిపోయి. అలాగే 20 బైక్‌లను కూడా తగులబెట్టారు. దీంతో రైల్వే స్టేషన్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిరసన తీవ్ర ఉద్రికత్తకు దారితీడయంతో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే కేంద్రం నిరసనలపై అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్ల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసింది.













