బీజేపీలో చేరిన సినీనటి జయసుధ
ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ జయసుధకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయసుధ సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇటీవల ఆమెతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించగా, అందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయి చర్చించారు. ఈ క్రమంలో బీజేపీ గూటికి చేరారు.













