బీజేపీలో చేరిన విజయశాంతి
కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్పర్సన్ విజయశాంతి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కాషాయ కండువాను కప్పి అరుణ్ సింగ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ 1998 జనవరి 26న తొలుత బీజేపీలో చేరానన్నారు. అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ అనుకూలంగా లేకపోవడం వల్ల బయటకొచ్చానన్నారు. అయితే పార్టీ విధివిధానాలు నచ్చడం వల్ల తిరిగి బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.













