తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా?

తెలంగాణా భారతదేశంలో అంతర్భాగం కాదా? అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సరిహద్దులో వాహనాల నిలిపివేతపై స్పందించిన ఆయన తెలంగాణ సరిహద్దులో ప్రతిసారీ పంచాయితీ లేమిటని ప్రశ్నించారు. పొందుగులవద్ద వాహనదారులపై పోలీసులు మళ్లీ లాఠిచార్జి చేస్తున్నారని, ముఖ్యమంత్రికి ప్రజల బాగోగులు పట్టావా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రజల ఆవేదన చెవిటివాని ముందు శంఖలా మారిందన్నారు. తెలంగాణలో ప్రత్యేక చట్టాలేమైనా అమలవుతున్నాయా? అని అన్నారు. ప్రజల ప్రాణాలతో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు. కనీసం మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. మంత్రినో, ఎమ్మెల్యేనో, ఆపితే చూస్తూ ఊరుకుంటారా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థం కావడం లేదన్నారు. సమన్వయానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలన్నారు. సమస్య ఇలాగే పునరావృతమవుతుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు.