వరంగల్ యువతికి అరుదైన అవకాశం
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణం రామన్నపేట ప్రాంతానికి చెందిన ప్రతిమ బలుధువా అనే యువతికి అరుదైన అవకావం దక్కింది. అక్టోబరు 2న ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో జరుగనున్న జాతీయ నాయకులను శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమంలో ప్రతిమ పాల్గొననుంది. క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నెహ్రూ యువకేంద్రం నిర్వహించిన జిల్లా స్థాయి వక్తృత పోటీల్లో ప్రతిమ ప్రథమ స్థానంలో గెలుపొందింది. రాష్ట్ర స్థాయిలోనూ తొలి స్థానంలో నిలిచింది. 29 రాష్ట్రాల నుంచి 25 మంది అభ్యర్థులను ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి ప్రతిమకు మాత్రమే ఈ అవకాశం లభించిందని నెహ్రూ యువకేంద్రం వెల్లడించింది.













