తెలంగాణ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను రాష్ట్ర ముఖ్మమంత్రి కేసీఆర్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి ఆయా కాలేజీలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం. ఒకనాడు అనేక సమస్యలతో తాగు, సాగునీటికి, కరెంటు, మెడికల్ సీట్లు, ఇంజినీరింగ్ సీట్లకు ఎన్నో రకాల అవస్థలుపడ్డ తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రమై అద్బుథంగా ఆత్మగౌరవంతో బతుకూతు దేశానికే మార్గదర్శకమైనటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముదుకెళ్తున్నాం. మనం ఇవాళ ఎనిమిది కళాశాలలను ప్రారంభించుకోవడం అందరికీ గర్వకారణంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.













