తెలంగాణలో 7,754 కేసులు..మరో 51 మంది
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,754 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 51 మంది కరోనాతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 2,312కు చేరింది. 6,542 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 3,62,160 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 78,888 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ 1507, సిద్దిపేటలో 270, నిజామాబాద్లో 267, మేడ్చల్ మల్కాజ్గిరిలో 630, రంగారెడ్డిలో 554, ఖమ్మంలో 230, మంచిర్యాలలో 216, వరంగల్ రూరల్లో 208, సంగారెడ్డిలో 325, జగిత్యాలలో 255, సూర్యాపేటలో 242, వికారాబాద్లో 242, కరీంనగర్లో 281, మహబూబ్నగర్ 279, నల్లగొండలో 231 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.52 శాతం ఉందని, రికవరీ రేటు 81.68 శాతంగా ఉందని పేర్కొంది.













