గీతం లో అంతర్జాతీయ సదస్సు
ప్రతిష్ఠాత్మక ఇండియన్ సొసైటీ ఆఫ్ థియోరిటికల్ అండ్ అప్లయిడ్ మెకానిక్స (ఇష్టం) 65వ అంతర్జాతీయ సదస్సు డిసెంబరు 9-12 మధ్య హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జరగనుంది. ఐఐటీ ఖరగ్పూర్ సౌజన్యంతో గీతంలోని గణితశాస్త్రం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించనున్నట్టు వర్సిటీ గణితశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మారుతీ ప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఫ్లూయిడ్ మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్ రంగలలో యువ పరిశోధకులను ప్రోత్సహించడమే ఈ సదస్సును ప్రదాన ఉద్దేశమని తెలిపారు. వివిధ దేశాలకు చెందిన నిపుణులు ఈ సదస్సును ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగిస్తారన్నారు. సదస్సులో పాల్గొనదలచిన వారు ఈ నెల 15లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.













