తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

గత పదేళ్లలో దేశంలో రైల్వే గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అహ్మదాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్-విశాఖ మార్గంలో రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కిషన్ రెడ్డి, వర్చువల్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోదని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టారని కొనియాడారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే మూడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయని, ఇవాళ మరో ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించడం సంతోషకరమన్నారు. చర్లపల్లి టెర్మినల్ పనులు 90 శాతం పూర్తయ్యాయని, మరికొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తామని తెలిపారు.