హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు

అంతరిక్ష వారోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో అక్టోబరు 4వ తేదీ నుంచి 7 వరకు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. పర్యావరణ యాజమాన్యం, స్పేస్ టెక్నాలజీ తదితర అంశాలపై జేఎన్టీయూలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, శాటిలైట్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ విభాగాలు నిర్వహించనున్న ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, ఇస్రో, ఎన్‌జీఆర్‌ఐ తదితర పరిశోధనా సంస్థల సెన్సింగ్ ఏజెన్సీ మాజీ శాస్త్రవేత్త మృత్యుంజయరెడ్డి చైర్మన్‌గా, జేఎన్టీయూ ప్రొఫెసర్ టి.విజయలక్ష్మి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. వాతావరణ మార్పులు` ప్రభావం, విపత్తుల ప్రభావాన్ని తగ్గించడం, సుస్థిర వ్యవసాయం, పట్టణ ప్రణాళికలో స్పేస్ పాత్ర తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు.