అంతర్జాతీయ త్రీడి ఆర్టిస్టుకు.. అమెరికా నుంచి మరోసారి ఆహ్వానం
అంతర్జాతీయ త్రీడి ఆర్టిస్టు, మంథని జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్టు)గా పనిచేస్తున్న సింగారపు శివరామకృష్ణకు అమెరికా నుంచి మరో ఆహ్వానం లభించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా లేక్ వర్త్ బీచ్ స్ట్రీటీ పెయింటింగ్ జరుగుతుంది. ఆగస్టు 24, 25 తేదీ లలో జరిగే పోటీల్లో ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయ ఆర్టిస్టులు పాల్గొంటారు. భారతదేశం నుంచి త్రీడి ఆర్టిస్టు శివరామకృష్షను ఈ పోటీల్లో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు. గతంలో కృష్ణ అమెరికాలోని డౌన్‌టౌన్ మినియా పోలీస్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. అక్కడి త్రీడి ఆర్టిస్టుపై మమకారం కలిగిన అమెరికన్లకు వర్క్‌షాప్ నిర్వహించి కళలోని మెళకువలు నేర్పించారు. తనకు మరో అరుదైన అవకాశం రావడం పట్ల శివరామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.













