తెలంగాణ ఎన్నికల బరిలో ట్రాన్స్ జెండర్
తెలంగాణ రాష్ట్రంలోని గోషామహల్ నియోజకవర్గం బీఎల్ఎఫ్ అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి నామినేషన్ దాఖలు చేశారు. అబిడ్స్‌లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వో.కృష్ణకు ఆమె నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకు ముందు గోషామహల్ నుంచి బీఎల్ఎఫ్ పార్టీ శ్రేణులతో తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రముఖి మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడుతున్నానని, సభలో తన గళం వినిపించేందుకు గానూ బీఎల్ఎఫ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా తాను నిలిచానని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ట్రాన్స్‌జెండర్ సమస్యలను తమ మ్యానిఫెస్టోలో గుర్తించాలని, సమాజంలో ట్రాన్స్‌జెండర్ అనే ఒక కమిటీ ఉందని, దానిని గుర్తిస్తే చాలని అన్నారు. అందరి లాగానే తమను కూడా మనుషులను గుర్తిస్తే చాలన్నారు.













