ప్రపంచ టాప్ 200 పరిశోధకుల్లో హెచ్‌సీయూ ఫ్యాకల్టీ
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బోధనాసిబ్బంది ప్రపంచ టాప్ 200 మంది పరిశోధకుల్లో స్థానం సంపాదించారు. ఈ విషయాన్ని వర్సిటీ వైస్ ఛాన్సలర్ పీ అప్పారావు తెలిపారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎల్సివీయర్, సైటెక్ స్ట్రాటెజీస్లు నిర్వహించిన సర్వేలో వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎంఎన్వీ ప్రసాద్ 116వ స్థానంలో, ప్రొఫెసర్ అశ్వినీ నాంగియా 124వ స్థానంలో, ప్రొఫెసర్ ప్రమోద్ కే నాయర్ 189వ స్థానంలో నిలిచినట్లు పీఎల్ఓఎస్ బయాలజీ సంస్థ గత వారం తమ పబ్లికేషన్స్‌లో వెల్లడించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 200 లో ఉన్న వర్సిటీ అధ్యాపకులు దేశవ్యాప్తంగా మొదటి 2 శాతం మంది పరిశోధకుల్లో ఉన్నట్లు స్కోపస్ (ఎస్సీఓపీఎస్) డేటా బేస్ ప్రచురణలు వెల్లడించినట్లు తెలిపారు.













