ఖమ్మంలో ఐటీ విస్తరణకు ప్రాధాన్యం….
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో ఐటి రంగాన్ని విస్తరిస్తున్నది. ఇప్పటికే ఖమ్మంలో ఐటి టవర్ నిర్మించడంతో పలు ఐటి సంస్థలు తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఐటిరంగంలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖమ్మంలో రెండో ఐటి టవర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న మంత్రి కెటిఆర్ ఆ టవర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.. ఈ వివరాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.. కెటిఆర్ ఆ రోజు పర్యటనలో భాగంగా ఖమ్మంలో నూతనంగా నిర్మించిన కొత్త బస్టాండ్‌ను ఖమ్మం ప్రజలకు అంకితం చేయనున్నారు.. అదే విధంగా సత్తుపల్లి కొత్త మున్సిపల్ భవనానికి శంఖుస్థాపన చేయనున్నారు.













