గ్రేటర్ ఎన్నికల్లో 2,592 నామినేషన్లు
గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. 150 వార్డులకుగాను 1,932 మంది అభ్యర్థులు.. 2,592 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్ఎస్ 557, బీజేపీ 571, కాంగ్రెస్ 372, టీడీపీ 206, ఎంఐఎం 78, సీపీఎం 22, సీపీఐ 21, గుర్తింపు పొందిన ఇతర పార్టీలు 115, స్వతంత్రుల నుంచి 650 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18 నుంచి నామినేషన్లు పక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఒక్కరోజే 1,937 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నామినేషన్ల పరిశీలన చేపడుతారు. ఉపసంహరణకు అదివారం సాయంత్రం వరకు గడువు ఉంటుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తారు.













