తెలంగాణలో 22 జిల్లాలో కరోనా నిల్
తెలంగాణలో వరుసగా ఆరో రోజు కూడా కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో 22 జిల్లాలు కరోనారహిత జిల్లాలుగా మారాయి. మంగళశారం ఆరుగురికి మాత్రమే వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1009కి చేరింది. 42 మంది బాధితులకు వైరస్ నెగెటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 374 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 25 మంది మరణించగా 610 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వనపర్తి, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు.













