లండన్ లో స్టడీటూర్ కు తెలంగాణ విద్యార్థినులు
తెలంగాణ ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్ల మధ్య ఒప్పందం మేరకు రాష్ట్రంలోని 15 మంది ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థినులు స్టడీ టూర్ కోసం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరి వెళ్లారు. ప్రభుత్వం డిగ్రీ కళాశాలల నుంచి అయిదుగురు, సాంఘిక సంక్షేమ శాఖ కళాశాలల నుంచి ఆరుగురు, గిరిజన సంక్షేమ శాఖ కళాశాలల నుంచి నలుగురు ఈ బృందంలో ఉన్నారు. వచ్చే నెల 8 వరకు ఈ స్టడీ టూర్ కొనసాగుతుంది. తమకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు సబితారెడ్డి, సత్యవతి, కొప్పుల ఈశ్వర్, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిత్తల్‌కు ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.













