13న అలయ్ బలయ్

ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వమిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడకులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.