తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. కొత్తగా
పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువగా చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లా కలెక్టర్లకు పంపారు.
కొత్త మండలాలు ఇవే..
గట్టుప్పల్ (నల్లగొండ), కౌకుంట (మహబూబ్నగర్), ఆలూర్ (నిజామాబాద్), సాలూర (నిజామాబాద్), డొంకేశ్వర్ ( నిజామాబాద్), సీరోల్ (మహబూబాబాద్), నిజాంపేట (సంగారెడ్డి), డోంగ్లీ (కామారెడ్డి), ఎండపల్లి (జగిత్యాల), భీమావరం (జగిత్యాల), గుండుమల్ (నారాయణపేట్), కొత్తపల్లె (నారాయణపేట్), డుడ్యాల్( వికారాబాద్) మండలాలు ఏర్పాటు కానున్నాయి. వీటిపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందించాలని పేర్కొంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.













