ప్రపంచ రికార్డులు నెలకొల్పిన మెట్ పల్లి చిన్నారి
పన్నెండేళ్ల వయస్సులోనే 9 రకాల నృత్యాలతో 369 నిమిషాల పాటు నిర్విరామంగా నృత్యాలు చేసి ప్రపంచ రికార్డులను తన సొంతం చేసుకుంది చిన్నారి సిరి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన కోట నరేష్-గౌతమిల కుమార్తె సిరి మెట్పల్లిలోని వాసవి గార్డెన్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్విరామంగా 9 రకాల నృత్యాలు చేసి 9 ప్రపంచ రికార్డులను కైవసం చేసుకుంది. ఇందులో భారత్ వరల్డ్ రికార్డ్, తెలుగు వరల్డ్ రికార్డ్, తెలంగాణ వరల్డ్ రికార్డ్, మెరాకిల్ గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్, కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, హనర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అమేజింగ్ కిడ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పత్రాలు ఆయా సంస్థల నుంచి చిన్నారికి అందించి సత్కరించారు. చిన్నతనంలో నిర్విరామంగా ఇన్ని రకాల నృత్యాలు చేయడాన్ని ప్రశంసించి ప్రపంచ రికార్డుల్లో సిరి పేరును నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు.













