గాంధీ ఖాతాలో మరో రికార్డు

తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 110 ఏళ్ల వయసున్న కురువృద్దుడు కరోనాను జయించాడు. కీసరలోని ఓ ఆశ్రయంలో ఉంటున్న రామానందతీర్ధ గత నెల 24వ తేదీన వైరస్ లక్షణాలతో చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అతనికి చికిత్సలు అందించి కరోనా వైరస్ బారి నుంచి ఆయన ప్రాణాలు కాపాడిన గాంధీ ఆస్పత్రి వైద్యబృందం మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆక్సిజన్ మీద చికిత్స తీసుకుంటున్న రామానంద తీర్థ కోలుకోవటంతో ఆయన్ను ఆస్పత్రి వైద్యులు డిశార్జ్ చేశారు. రామానందకు ఎలాంటి ఇతర జబ్బులు లేకపోవడం వల్ల ఇది సాధ్యమైందని, ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని గాంధీ ఆసుపత్రి సూపరిడెంట్ రాజారావు తెలిపారు. అయితే మరికొన్ని రోజులు తమ పరిశీలనలో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఆశ్రమంలో ఉంటున్న రామానందకు ఆయినవారు ఎవరూ లేకపోవటంతో గాంధీలోనే 7వ ఫ్లోర్‍లో బస ఏర్పాటు చేసిన ఆస్పత్రి సూపరిడెంట్ రాజారావు మానవత్వం చాటుకున్నారు.