యాదాద్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి బాలాలయంలో ఉదయం 10:55 గంటలకు పాంచరాత్ర ఆగమ శాస్త్రాను సారంగా శ్రీ విష్వక్సేనారాధన, స్వస్తివాచనం కార్యక్రమాలతో ఉత్సవాలకు వేదపండితులు శ్రీకారం చుట్టారు. రక్షాబంధనంతో అధికారుల ఉత్సవ దీక్ష మొదలైంది. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి పూజలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ సుధాహేమేందర్ హాజరయ్యారు. పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













