తెలంగాణ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టులో నూతనంగా పది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్నినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్ శ్రవణ్‌కుమార్ వెంకట్, గుణ్ణు అనుపమ చక్రవర్తి, గిరిజ ప్రియదర్శిని, సాంబశివరావు, అనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్ దేవరాజ్ నాగార్జున్ ఉన్నారు. కొత్తగా నియమితులైన పది మంది జడ్జిలతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుతం 19 మంది జడ్జిలు సేవలు అందిస్తున్నారు. కాగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉన్నది. అయితే హైకోర్టులో ఒకేసారి పది మంది న్యాయమూర్తులు నియమితులవడం ఇదే మొదటిసారి.













