మీరు చేస్తారా… మమ్మల్ని చేయమంటారా?
కిందిస్థాయి కోర్టులో 5వేలకు పైగా న్యాయాధికారుల పోస్టుల భర్తీలో జాప్యంపై సుప్రీం కోర్టు గురువారం హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా ఆక్షేపించింది. నియామకాలను హైకోర్టులు చేపట్టకుంటే ఆ పనిని తామే చేస్తామని సృష్టం చేసింది. సమస్య తీవ్రతను గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తనంతట తానుగా స్పందించింది. జడ్జీల ఖాళీల భర్తికి కాలావధిని సూచిస్తూ వివరాలు అందజేయాల్సిందిగా దేశంలో 24 హైకోర్టులు, 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను మునుపటి విచారణలో ఆదేశించింది. పలు హైకోర్టు రిజిస్ట్రీలు దాఖలు చేసిన నివేదికలను తాజా విచారణలో పరిశీలించింది. దేశంలోని 24 హైకోర్టులు, 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను 4 విభాగాలుగా వర్గీకరిస్తున్నట్లు తెలిపింది. కోర్టులో ఖాళీలు, మౌలిక వసతులను ఒక్కొక్కటిగా పరిశీలిస్తామని పేర్కొంది.













