బంపర్ ఆఫర్ ప్రకటించిన స్పైస్‌జెట్
ప్రముఖ విమానాయాన సంస్థ స్పైస్ జెట్ మెగా మాన్సూన్ సేల్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం రూ.699 నుంచి టికెట్ ధర ప్రారంభం కానుంది. దేశీయ మార్గాల్లో ప్రయాణించేవారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని స్పైస్ జెట్ వెల్లడించింది. జమ్ము-శ్రీనగర్, గువహటి-అగర్తలా, ఐజ్వాల్-గువహటితో పాటు మరికొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో ఈ ఆఫర్ ఆ సంస్థ అందిస్తోంది. మెగా మూన్సూన్ సేల్ కింద జూన్ 28 నుంచి జులై 4 వరకు మాత్రమే టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. నిర్ణీత సంఖ్యలో మాత్రమే టికెట్లను ఉంచనున్నారు. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు జులై 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 మధ్య ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఈ ఆఫర్‌తో టికెట్లు బుక్ చేసుకున్న వారిలో కొంతమందిని లక్కీడ్రాలో ఎంపిక చేయనుంది. ఎంపికైన వారికి దుబాయ్, మాలే, కొలంబో, బ్యాంకాక్, మస్కట్ వెళ్లేందుకు వీలుగా హాలీడే ప్యాకేజ్‌ను అందించనున్నట్లు స్పైస్ జెట్ వెల్లడించింది.













