ఎన్నారైల ఓటింగ్‌పై నిర్ణయం తెలపండి!
ఎన్నికల్లో ప్రవాస భారతీయుల(ఎన్నారైలు)కు పోస్టల్ / ఈ-బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు అనుమతిస్తూ ఎన్నికల చట్టం లేదా నిబంధనల సవరణపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి నిర్దేశించింది. ఎన్నారైలకు ఓటు అవకాశం కల్పించవచ్చని ప్రతిపాదిస్తూ గతంలో ఈసీ, విదేశీ వ్యవహారాలు, న్యాయ శాఖల అధికారులతో కూడిన 12 మంది సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ ప్రతిపాదననలు కేంద్రం, ఎన్నికల సంఘం సూత్రాప్రాయంగా అంగీకరించిన విషయం సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటికే రెండు సార్లు కేంద్రానికి గడువిచ్చిన విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రుచూడ్లతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది. తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ ఈ నెల 21కి వాయిదా వేసింది.













