సానియా మీర్జా అభిమానులకు శుభవార్త
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోతోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు అని పేర్కొంటూ బేబీ మీర్జా మాలిక్ అని క్యాప్షన్ పెట్టారు. ఈ విషయం తెలియగానే సానియా స్నేహితులు, ప్రముఖ బాలీవుడ్ కొరియాగ్రాఫర్ ఫరాఖాన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చాలాకాలం తర్వాత ఓ శుభవార్త విన్నాను. కంగ్రాట్స సానియా, షోయబ్ అని ట్విట్ చేశారు.













