మిసెస్ యూనివర్సల్ ఫైనల్‌కు రోహిణినాయుడు
వరల్డ్ మిసెస్ యూనివర్సల్ ఫైనల్‌కు హైదరాబాద్‌కు చెందిన రోహిణినాయుడు ఎంపికయ్యారు. ఈ సంవత్సరం అక్టోబర్‌లో జరగబోయే ఫైనల్స్‌లో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హాట్ మోండే మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2019 జరిగిన పోటీల ద్వారా తాను యూనివర్సల్ ఫైనల్ పోటీలకు ఎంపికయ్యానన్నారు. ప్రపంచ దేశాల నుంచి 30 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 172 మందిని ఫైనల్‌కు ఎంపిక చేశారని, అందులో మన దేశం నుంచి తాను ఎంపికయ్యానన్నారు. అక్టోబర్ నెలలో గ్రీస్‌లో జరగబోయే వరల్డ్ మిసెస్ యూనివర్సల్ పోటీకి ఎంపిక కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో భాగంగా నాలుగు వారాల పాటు వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారత, జెండర్ ఈక్వాలిటీ తదితర అంశాలలో వారానికి ఓ అంశంపై నాలుగు టాస్క్ లు చేసి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు.













