విమాన ప్రయాణికులకు శుభవార్త
విమాన ప్రయాణికులకు శుభవార్త. తమ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసుకునే వారికి రూ.50 లక్షల వరకు ఉచిత ప్రయాణ బీమా సౌకర్యాన్ని రైల్వేకు చెందిన ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లోని అన్ని రకాల టికెట్లకు ఈ సదుపాయం వర్తిస్తుందని ఐఆర్సీటీసీ తెలిపింది. అనుకోని ప్రమాదం సంభవించి ప్రయాణికులు చనిపోయినా, శాశ్వత, పాక్షిక అంగ వైక్యల్యానికి గురైనా వారికి, వారి సంబంధీకులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని వివరించింది. భారతీ యాక్సా జనరల్ ఇన్షూరెన్స్ ద్వారా ఈ ఉచిత ప్రయాణ బీమా సదుపాయం కల్పిస్తామని, దీనికి సంబంధించిన ప్రీమియం ఐఆర్సీటీసీనే చెల్లిస్తుందని తెలిపింది.













