అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఇవాళ అమెరికా పయనం కానున్నారు. తన తల్లి సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా బయలేర్దనున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం బాగోలేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె వైద్య పరీక్షలకు వెళ్లాల్సి ఉంది అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2011లో అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సంవత్సరానికోసారి వైద్య పరీక్షల కోసం ఆమె అమెరికా వెళ్తారు.













