ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 68వ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయువుతో వర్థిల్లాలనీ, ఇంకా అనేక సంవత్సరాలు దేశ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాని అని రాష్ట్రపతి ట్వీట్చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.













