చర్చల ద్వారానే పరిష్కారం
21వ శతాబ్దంలో ప్రపంచం అనేక ఆటుపోట్లకు గురైంది. అనేక పెను సవాళ్లనే ఎదుర్కొంది. ఉగ్రవాదం, పర్యావరణ మార్పులు వంటి సమస్యలను ఎదుర్కొంది’అని మోదీ స్పష్టం చేశారు. ఎలాంటి సమస్యనైనా చర్చలద్వారానే పరిష్కరించుకోవచ్చన్నది తన ప్రగాఢ విశ్వాసం అని ఆయన తెలిపారు.‘పురాతన భారతీయ సంప్రదాయం ప్రకారం సంప్రదింపులే సమస్యకు పరిష్కారం చూపుతాయి’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, మత వైషమ్యాలు వంటి అనేక సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘సంవాద’ రెండో ఎడిషన్ వీడియో కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు.‘ భారతీయ సంప్రదాయ సిద్ధాంతం తర్కశాస్త్రాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, భక్తప్రహ్లాదల బోధనలను గుర్తుచేశారు.













