రాజకీయాల్లోకి వచ్చాకా సన్యాసులు కాదు
మతాధిపతులు, సన్యాసులు రాజకీయాల్లోకి ప్రవేశించి చురుకగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటే తరువాత వారు సన్యాసులు కానట్లేనని స్వయం దేవతగా ప్రకటించుకున్న రాధే మా అన్నారు. మతాధిపతులు, సన్యాసులు ప్రభుత్వం నుంచి భద్రత కోరకూడదని అమె చెప్పారు. ఒక ప్రయివేటు ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి ప్రవేశించనన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన వారు సాధువులు, సన్యాసులు కాబోరని అమె చెప్పారు. ప్రధాని మోడీ తొలినాళ్లలో మంచి పనులు చేశారని, అయితే ప్రస్తుతం ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిందని అన్నారు. అయితే భవిష్యత్తులో ప్రజలు తమ అభిప్రాయాలు మార్చుకుంటారని తన మనస్సు చెబుతోందని అన్నారు.













