ఏపీలో 11 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో 11 మంది వైసీపీ చెందిన అభ్యర్థులు శాసనమండలి సభ్యులుగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ అధికారిక నోటిఫికేసన్ జారీ చేశారు. మొత్తం 8 జిల్లాల్లోని స్థానిక సంస్థల నుంచి వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో పేర్కొంది. అనంతపురం నుంచి యాల్లారెడ్డి గారి శివరామిరెడ్డి, కృష్ణాజిల్లా నుంచి తలశిల రఘురామ్, మొండితోక అరుణ్ కుమార్లు ఎన్నికైట్టు తెలిపింది. తూర్పు గోదావరి నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నోటిఫికేషన్లో ప్రకటించింది. విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖ నుంచి వరుదు కల్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, చిత్తూరు నుంచి కృష్ణరాఘవ జయేంద్ర భరత్, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు తెలిపింది.













