గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ప్రకటించడం జరిగింది. ఉమ్మడి విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ స్థానానికి ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఎస్.సుధాకర్ పేరు ఖరారు చేశారు. అలాగే ఉమ్మడి ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి గూడూరు నియోజకవర్గానికి చెందిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఉమ్మడి కర్నూలు-కడప-అనంతపురం గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి వెన్నపూస రవి పేరు ఖరారు చేయడం జరిగింది.













