రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ
త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణతో పాటు వైఎస్ఆర్సీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని పేర్లను అధికారికంగా ప్రకటించింది. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌లు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీరిద్దరినీ రాజ్యసభకు నామినేట్ చేయాలని నిర్ణయించారు. కాగా ఆంధప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు స్థానాలనూ అధికార వైఎస్ఆర్ సీపీ కైసవం చేసుకోనుంది. అసెంబ్లీలో సృష్టమైన మెజార్టీ ఉండటంతో నలుగురి ఎన్నిక నల్లేరుమీద నడక కానుంది.













